‘పుష్ప – 2’ : మరో సర్ప్రైజ్ రెడీ చేస్తోన్న టీమ్ ?

‘పుష్ప – 2’ : మరో సర్ప్రైజ్ రెడీ చేస్తోన్న టీమ్ ?

Published on Apr 18, 2024 3:00 AM IST

పాన్ ఇండియన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ పుష్ప 2 పై రోజు రోజుకు అందరిలో భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ ఆగష్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి ఇటీవల అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ గ్లింప్స్ టీజర్ అందరిని ఎంతో ఆకట్టుకుంది. ఇందులో అల్లు అర్జున్ లుక్, విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి.

విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ బజ్ ప్రకారం త్వరలో పుష్ప 2 నుండి మరొక టీజర్ ని రిలీజ్ చేసేందుకు టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టీజర్ లో యాక్షన్ సీన్స్ తో పాటు డైలాగ్స్ కూడా ఉండనున్నాయని, అనంతరం మూవీ నుండి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేసే అవకాశం ఉందని లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఇక దీని పై త్వరలో మేకర్స్ నుండి పూర్తి డీటెయిల్స్ వెల్లడి కానున్నాయట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు