రష్మిక బర్త్ డే కి పుష్ప 2 నుండి అప్డేట్?

రష్మిక బర్త్ డే కి పుష్ప 2 నుండి అప్డేట్?

Published on Apr 1, 2024 12:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2 ది రూల్ (Pushpa 2 the rule). ఈ చిత్రం లో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika mandanna) ఫీమేల్ లీడ్ రోల్ అయిన శ్రీవల్లి పాత్రలో లో నటిస్తుంది. ఈ క్రేజీ రోల్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. పుష్ప పార్ట్ 1 తో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ హీరోయిన్ బర్త్ డే ఏప్రిల్ 5.

అయితే హీరోయిన్ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ నుండి అప్డేట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రష్మిక లుక్ లేదా, చిన్నపాటి గ్లింప్స్ వీడియో ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. మరి దీనిపై మేకర్స్ నుండి క్లారిటీ రావాల్సి ఉంది. అంతేకాక బన్నీ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 ను రిలీజ్ చేయనున్నారు మేకర్స్. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు