మరోసారి డీసెంట్ టీఆర్పీ రాబట్టిన “పుష్ప”

మరోసారి డీసెంట్ టీఆర్పీ రాబట్టిన “పుష్ప”

Published on Jan 25, 2024 8:14 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప ది రైజ్. ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం ఎన్నో సార్లు టీవీ లో వచ్చినా, మళ్ళీ మరోసారి డీసెంట్ టీఆర్పీ రేటింగ్ ను రాబట్టడం జరిగింది. ఈ చిత్రం ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ఇటీవల ప్రసారం కాగా 4.44 టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసుకుంది.

పుష్ప ది రైజ్ తర్వాత అల్లు అర్జున్ తన పూర్తి సమయాన్ని సీక్వెల్ పుష్ప 2 ది రూల్ కోసం కేటాయిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం లో సునీల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, రావు రమేష్, ఫాహద్ ఫజిల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు