ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనున్న “పుష్ప” రాజ్?

ఉత్తరాంధ్రలో అడుగు పెట్టనున్న “పుష్ప” రాజ్?

Published on Mar 5, 2024 10:02 AM IST

పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో చేస్తున్న భారీ చిత్రం “పుష్ప 2” కోసం ఇప్పుడు పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా స్పాన్ పెరగడం కంటెంట్ కూడా గ్లోబల్ రీచ్ ఉండేలా ప్లాన్ చేయడంతో పార్ట్ 2 ని ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఇప్పుడు హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ కంప్లీట్ చేసుకుంటున్న ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ నిమిత్తం వైజాగ్ కి షిఫ్ట్ అవ్వనున్నట్టుగా తెలుస్తుంది. దీనితో పుష్ప రాజ్ అడుగు ఉత్తరాంధ్రలో పడనుంది అని చెప్పాలి. బన్నీకి వైజాగ్ కి ప్రత్యేకమైన కనెక్షన్ ఉంది. మరి ఈ భారీ సినిమా విషయంలో ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు