కరోనా పై ‘పుష్ప’ టీమ్ కొత్త ప్లాన్ !

Published on Jun 1, 2020 10:21 am IST

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలయికలో పుష్ప చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఆగ‌స్ట్ నుండి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ముందుగా సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో స్టార్ట్ చేస్తారట. పైగా స‌భ్యులంద‌రికీ కరోనా టెస్ట్ చేసి, వారికీ కరోనా సోకే అవకాశం లేకుండా టీమ్ అందర్నీ షూట్ జరుగుతున్న అంత కాలం జన సాంద్రతకు దూరమైన ప్రాంతంలోనే ఉంచాలని టీమ్ భావిస్తోందట. మెయిన్ గా పుష్ప చిత్రబృందం వారు ఇత‌రుల‌ను క‌ల‌వ‌డం గాని.. ఇత‌రులు వారున్న ప్ర‌దేశానికి రావడం గాని లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకుంటార‌ని టాక్‌ వినిపిస్తోంది.

ఇక పుష్ప సినిమాకి దేవి శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఎప్పుడూ బిజీగా ఉండే దేవీ శ్రీ, ఈసారి కూల్‌గా తీరిగ్గా కూర్చుని మ‌రీ పుష్ప సినిమాకి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నాడ‌ట‌‌. ఇక మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా సుకుమార్, సుకుమార్ రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. రష్మిక మండన్న హీరోయిన్ గా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :

More