బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ‘పుష్ప: ది రైజ్’ స్పెషల్ సిజిల్

బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడిన ‘పుష్ప: ది రైజ్’ స్పెషల్ సిజిల్

Published on Feb 17, 2024 7:11 PM IST

ప్రస్తుతం బెర్లిన్ లో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాన్ ఇండియన్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఇండియన్ సినిమాకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐకాన్ స్టార్ రెడ్ కార్పెట్ మీద నడుస్తున్న వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అయింది. 2021 డిసెంబర్ లో థియేటర్లలో విడుదలైన పుష్ప ది రైజ్ శనివారం చిత్రోత్సవంలో ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేయగా అది అందరినీ ఆకట్టుకుంది.

నిర్వాహకులు అతిథులని ఈ పాన్ ఇండియన్ మూవీకి సంబంధించిన ప్రత్యేక సిజిల్‌తో సత్కరించారు. ఇక దీనికి సీక్వెల్ అయిన పుష్ప 2 మూవీని ఆగస్ట్ 15, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుందని అల్లు అర్జున్ తెలిపారు. మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ఈ లెవెల్లో నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం పుష్ప పార్ట్ 1 కంటే గ్రాండ్ లెవెల్లో ఉండబోతోందని ధృవీకరించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు