టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “పుష్పక విమానం”

టీవీ ప్రీమియర్ కి రెడీ అయిన “పుష్పక విమానం”

Published on May 15, 2024 7:58 PM IST

ఆనంద్ దేవరకొండ ప్రధాన పాత్రలో, దామోదర దర్శకత్వం లో తెరకెక్కిన తెలుగు కామెడీ థ్రిల్లర్ పుష్పక విమానం. ఈ చిత్రం నవంబర్ 12, 2021 లో థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం చాలా గ్యాప్ తర్వాత వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకి వచ్చేందుకు రెడీ అయిపోయింది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా ఛానెల్ సొంతం చేసుకుంది.

స్టార్ మా ఛానెల్ లో ఈ ఆదివారం మధ్యాహ్నం 1:00 గంటలకి పుష్పక విమానం ప్రసారం కానుంది. గీత్ సైనీ, శాన్వి మేఘన, సునీల్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం బుల్లితెర పై ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఆనంద్ దేవరకొండ తదుపరి గం గం గణేశా చిత్రం లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు