‘జపాన్‌’లో అల్లు అర్జున్ కి ఫుల్ క్రేజ్

‘జపాన్‌’లో అల్లు అర్జున్ కి ఫుల్ క్రేజ్

Published on Feb 18, 2024 4:09 PM IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న ‘పుష్ప-2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐతే, బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న అల్లు అర్జున్‌కు ఘన స్వాగతం లభించిందని మైత్రి మూవీ మేకర్స్ పేర్కొంది. ఫెస్టివల్‌లో భారీ స్క్రీన్‌పై పుష్ప-1 సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ తర్వాత అంతర్జాతీయ మీడియా, జర్మన్ ప్రజలు చిత్రయూనిట్‌ను ప్రశంసించింది.

ఇక ఈ ఏడాది ఆగస్టు 15న ‘పుష్ప-2’ ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతుందని తెలుపుతూ పలు ఫొటోలను పంచుకుంది. బన్నీతో సెల్ఫీ కోసం అక్కడి ఫ్యాన్స్ ఎగబడ్డారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా భారీ సెన్సేషనల్ హైప్ ఉన్న క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో “పుష్ప 2 ది రూల్” కూడా ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తోంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు