టాప్ ప్రొడ్యూసర్ సరికొత్త ప్రమోషన్స్ స్ట్రాటజీ!

pvp
పీవీపీ సినిమా.. తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో వరుసగా సినిమాలు నిర్మించుకుంటూ వెళుతూ, సౌతిండియన్ సినిమాకు ఒక కార్పొరేట్ స్టైల్‌ను తీసుకొచ్చిన సంస్థ. ప్రస్తుతం ‘సైజ్ జీరో’, ‘బ్రహ్మోత్సవం’, ‘ఊపిరి’ లాంటి క్రేజీ ప్రాజెక్టులతో పీవీపీ సినిమా తెలుగు, తమిళంలో టాప్ ప్రొడక్షన్ హౌసెస్‌లో ఒకటిగా దూసుకుపోతోంది. ఇక ఈ సంస్థను నెలకొల్పిన ప్రసాద్ వి. పొట్లూరి ఇప్పటివరకూ సినిమాకు సంబంధించిన ప్రొడక్షన్ కార్యక్రమాలకే పరిమితం కాగా తాజాగా సైజ్ జీరోతో ప్రమోషన్స్‌లోనూ ఇన్వాల్వ్ అవుతూ ఆసక్తి రేకెత్తిస్తున్నారు.

గతంలో ఏ సినిమాకూ చేపట్టనంతగా ‘సైజ్ జీరో’ విషయంలో పీవీపీ టీమ్ పలు వినూత్న ప్రచార కార్యక్రమాలను రూపొందించి క్రేజీగా మారిపోయింది. ఇక ఈ కార్యక్రమాల్లో పీవీపీ సైతం పాల్గొనడం విశేషంగా చెప్పుకోవచ్చు. ‘కాసుల వర్షం మాకు.. కనక వర్షం మీకు’ పేరుతో పీవీపీ టీమ్ ఓ వినూత్న కాంటెస్ట్‌ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ కాంటెస్ట్‌‌ను అనౌన్స్ చేయడానికి ‘సైజ్ జీరో’ హీరోయిన్ అనుష్క, దర్శకుడు ప్రకాష్ కోవెలమూడితో కలిసి పీవీపీ స్వయంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.

అదే విధంగా సైజ్ జీరో రిలీజ్‌కు ఇంకా మూడు రోజులే ఉండడంతో పీవీపీ ఇకపై మరింతగా ప్రమోషన్స్‌తో భాగం కానున్నారని తెలుస్తోంది. ఫిబ్రవరి నెలలో నాగ్-కార్తీ నటించిన ‘ఊపిరి’, సమ్మర్‌లో మహేష్ నటిస్తోన్న ‘బ్రహ్మోత్సవం’ ఇలా మరో రెండు టాప్ సినిమాలు పీవీపీ సంస్థ నుండి రానుండడంతో ఇప్పట్నుంచే ప్రచారాలతో సంస్థను ముందుకు తీసుకెళ్ళేలా పీవీపీ ఈ కొత్త స్ట్రాటజీని అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version