ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ‘రా రా ధీవర’.. స్వయంభు కి మంచి మ్యూజికల్ కిక్..!

నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘స్వయంభు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన మొదటి సాంగ్ ‘రా రా ధీవర’ ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ పాట నిఖిల్ పవర్‌ఫుల్ వారియర్ లుక్‌ను ప్రజెంట్ చేస్తూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ప్రస్తుతం ఈ హై-ఎనర్జీ సాంగ్ స్పాటిఫైలో 100K కి పైగా స్ట్రీమ్స్‌తో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. రవి బస్రూర్ అందించిన థంపింగ్ మ్యూజిక్, దానికి తోడు నిఖిల్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ ఈ పాటను ఒక రేంజ్‌కు తీసుకెళ్లాయి. అద్భుతమైన కొరియోగ్రఫీ, పవర్‌ఫుల్ లిరిక్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఈ ఒక్క పాటతోనే ‘స్వయంభు’ టీమ్ భారీ స్థాయిలో పబ్లిసిటీని దక్కించుకుంది.

పాన్ ఇండియా లెవల్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఈ వేసవిలో విడుదల కానుంది. త్వరలోనే చిత్ర యూనిట్ అధికారిక విడుదల తేదీని ప్రకటించనుంది. రానున్న రోజుల్లో సినిమా నుండి మరిన్ని అప్‌డేట్స్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version