‘రా రా కృష్ణయ్య’ ట్రైలర్ కి మంచి స్పందన

Ra Ra Krishnayya
ఇటివల విడుదలైన ‘రా రా కృష్ణయ్య’ ట్రైలర్ కి ప్రేక్షకుల దగ్గరనుంచి మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రంలో లవ్లీ పెయిర్ రెజినా సందీప్ కిషన్ మరోసారి జంటగా నటిస్తున్నారు.

ఈ జంట కెమిస్ట్రీ ట్రైలర్లో అద్బుతంగా వుంది అదే ఈ చిత్రానికి పెద్ద ప్లస్ అవ్వనుంది. ‘వెంకటాద్రి ఎక్ష్ప్రెస్’ హిట్ తో సందీప్ మంచి ఊపు మీదవున్నాడు. టాలీవుడ్ లో తన స్థానాన్ని బలపర్చుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నాడు.

మహేష్ బాబు.పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అచ్చు సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version