మెగా డాటర్ నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేసిన లేటెస్ట్ హారర్ కామెడీ చిత్రం ‘రాకాస’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. మానస శర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ అయింది. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ దక్కించుకున్న ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆదరణ క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర స్టడీగా దూసుకెళ్తోంది.
ఇక ఈ సినిమాలో హారర్ అండ్ కామెడీ అంశాలు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి. దీంతో ఈ సినిమా వసూళ్లు కూడా పెరుగుతూ వచ్చాయి. ఈ సినిమా రిలీజ్ అయిన 10 రోజుల్లో ఈ మూవీ ఏకంగా రూ.22.60 కోట్ల మేర వసూళ్లు సాధించి తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సినిమాలేవీ పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో ఈ గ్యాప్‌ను రాకాస క్యాష్ చేసుకుంటుంది.
సంగీత్ శోభన్, నయన్ సారిక, గెటప్ శ్రీను ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈ సినిమా టోటల్ రన్‌లో ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.


