షూటింగ్‌లో గాయపడ్డ రాశి ఖన్నా.. ఏం జరిగిందంటే..?

అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ప్రధాన పాత్రల్లో అనీస్ బజ్మీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా బాలీవుడ్ కామెడీ చిత్ర షూటింగ్‌లో హీరోయిన్ రాశీ ఖన్నా గాయపడింది. యాక్షన్ సన్నివేశాల షూటింగ్ సమయంలో తను అనారోగ్యానికి గురై, గాయపడినప్పటికీ షూటింగ్ ఆపలేదని, తన కెరీర్‌లోనే ఇది అత్యంత కష్టమైన షెడ్యూల్ అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.

కష్టసమయంలో తన కుటుంబం, తోటి నటులు మరియు చిత్రబృందం ఇచ్చిన సపోర్ట్ వల్లే షూటింగ్ పూర్తి చేయగలిగానని రాశీ ఖన్నా తెలిపింది. సుదేశ్ లెహ్రి, విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ఎంటర్‌టైనర్ రాబోయే డిసెంబర్ 4న థియేటర్లలో విడుదల కానుంది.

Exit mobile version