‘సుప్రీమ్’కి కామెడీ టచ్ ఇస్తున్న రాశీ ఖన్నా

Raashi-Khanna
‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాతో హిట్ అందుకున్న యంగ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం జోరుగా సినిమాలు చేస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ నటిస్తున్న ‘సుప్రీమ్’ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఈ సినిమాలో రాశీ ఖన్నాహీరోయిన్ గా కనిపించనుంది. సుప్రీమ్ లో రాశీ ఖన్నాకి కేవలం గ్లామ్ డాల్ అనే పాత్ర కాకుండా రిస్క్ లు కూడా చేసే స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుందని ఇదివరకే తెలియజేశాం.

అంతే కాకుండా రాశీ ఖన్నాకి నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్ర చేస్తోంది. అందులోనూ మొదటిసారి ఫుల్ కామెడీ టచ్ ఉన్న పాత్రలో రాశీ ఖన్నా కనిపించనుంది. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ – రాశీ ఖన్నా – వెన్నెల కిషోర్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ ఆడియన్స్ బాగా నవ్విస్తాయని సమాచారం. పటాస్ ఫేం అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాత. ఇది కాకుండా రాశీ ఖన్నా నటించిన మరో సినిమా ‘బెంగాల్ టైగర్’. అక్టోబర్ 10న రిలీజ్ కానున్న ఈ సినిమాలో కూడా రాశీ ఖన్నా పోలీస్ పాత్రలోనే కనిపించనుంది.

Exit mobile version