“రాయన్” గా ధనుష్…ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!

“రాయన్” గా ధనుష్…ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్!

Published on Feb 19, 2024 7:02 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస చిత్రాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈ హీరో చివరిసారిగా కెప్టెన్ మిల్లర్ చిత్రం తో ఆడియెన్స్ ముందుకి వచ్చారు. ఈ చిత్రం ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంది. అయితే తెలుగు లో మాత్రం బాక్సాఫీస్ వద్ద అంతగా రాణించలేదు. ఇప్పుడు హీరో ధనుష్ మరొక ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ధనుష్ యొక్క 50 వ చిత్రం రాయన్ గా మేకర్స్ నేడు ప్రకటించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. సందీప్ కిషన్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకి రచన, దర్శకత్వం హీరో ధనుష్ వ్యవహరిస్తుండటం విశేషం. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు