“రాయన్” నుండి సందీప్, అపర్ణ ల సాంగ్ రిలీజ్ కి రెడీ!

“రాయన్” నుండి సందీప్, అపర్ణ ల సాంగ్ రిలీజ్ కి రెడీ!

Published on May 23, 2024 2:00 AM IST

కెప్టెన్ మిల్లర్ తర్వాత కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరియు టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటిస్తున్న మూవీ రాయన్. రాయన్ చిత్రానికి ధనుష్ స్వయంగా దర్శకత్వం వహిస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ నెల 24న రెండో పాటను లాంచ్ చేయనున్నారు. రెండవ పాటలో సందీప్ కిషన్ మరియు అపర్ణ రొమాంటిక్ జంటగా కనిపించనున్నారు.

ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ సూచించినట్లుగా, వారు AR రెహమాన్ స్వరపరిచిన పాటలో అద్భుతమైన కెమిస్ట్రీని పంచుకున్నారు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాలో ధనుష్, సందీప్ కిషన్ లతో పాటు కాళిదాస్ జయరామ్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. జూన్ 13న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రాయన్ విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు