“రాయన్” ఆడియో లాంచ్ ఈవెంట్ కి రెడీ?

“రాయన్” ఆడియో లాంచ్ ఈవెంట్ కి రెడీ?

Published on May 15, 2024 1:54 PM IST


కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అందులో రాయన్ చిత్రం పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం అతనికి నటుడిగా 50 వ చిత్రం కాగా, దర్శకుడు గా రెండవ చిత్రం. జూన్ 13, 2024న థియేట్రికల్ రిలీజ్‌కి రెడీ అయిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గ్రాండ్ ఆడియో లాంచ్ ఈవెంట్‌కి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అధికారికంగా ప్రకటించనప్పటికీ, జూన్ 1, 2024న చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఈవెంట్ జరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. SJ సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణ బాలమురళి మరియు వరలక్ష్మి శరత్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ను సన్ పిక్చర్స్ పై నిర్మిస్తున్నారు. AR రెహమాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు