
‘బృందావనం’, ‘బాద్షా’, ‘రామయ్యా వస్తావయ్యా’ వంటి మ్యూజికల్ హిట్ మూవీస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, యువ సంగీత సంచలనం తమన్ కలయికలో వస్తున్న సినిమా ‘రభస’. ఈ సినిమా ఆడియోపై అభిమానులలో అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి. హట్రిక్ హిట్స్ తర్వాత ‘రాకాసి.. రాకాసి..’ అంటూ ఎన్టీఆర్ తన గళాన్ని వినిపించడమే కారణం. జూలై 27న ‘రభస’ ఆడియో విడుదల కార్యక్రమాన్ని అభిమానుల సమక్షంలో నిర్వహించనున్నారు.
‘రభస’లో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. అందులో థీమ్ సాంగ్ ఒకటి.
1) లాల్ సలాం..
2) సైయో.. సైయోరే..
3) చెలి నిశ్చేలి..
4) సరోజ సరోజ..
5) రాకాసి.. రాకాసి..
6) రభస థీమ్ సాంగ్..
ఎన్టీఆర్ సరసన సమంత, ప్రణిత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి ‘కందిరీగ’ ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. బెల్లంకొండ సురేష్ నిర్మాత. ఎన్టీఆర్ నుండి అభిమానులు ఆశించే యాక్షన్ తో పాటు ఫుల్ కామెడీ ఈ చిత్రంలో ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్పారు. సినిమా ఆగస్ట్ 14న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

