“రాధే శ్యామ్” మలి అప్డేట్ కోసమే అంతా వెయిటింగ్.!

Published on Apr 10, 2021 8:06 pm IST

ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రాల్లో దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న అద్భుతమైన ప్రేమ కావ్యం “రాధే శ్యామ్” కూడా ఒకటి. అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వస్తున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ సమయానుగుణంగా అప్డేట్స్ ఇస్తూ వస్తున్నారు.

ఆ మధ్య బాగా లేట్ అవుతుంది అనుకునే సమయంలోనే ఒకదాన్ని మించి ఒక అప్డేట్ ఇస్తూ మంచి హైప్ క్రియేట్ చేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే విధంగా గ్యాప్ ఎక్కువ అవుతుండడంతో పైగా ఇతర ముఖ్య అన్ని సినిమాలకు అప్డేట్స్ వెల్లువెత్తుతుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ గా ఉన్నారు.

సో ఇప్పుడు ఎలాగో గ్యాప్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ రాధే శ్యామ్ మేకర్స్ ఓ మంచి సమయం చూసి అప్డేట్స్ కానీ మంచి పోస్టర్స్ కానీ వదలొచ్చు. అలాగే ఆడియో పరంగా కూడా అప్డేట్ ఇచ్చే ఆస్కారం ఉంది. సో రాధే శ్యామ్ నుంచి నెక్స్ట్ రాబోయే అప్డేట్ నే మంచి మోస్ట్ అవైటెడ్ గా మారింది. మరి ఈ మలి అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :