యూఎస్ లో సాలిడ్ బుకింగ్స్ తో “రాధే శ్యామ్”..!

Published on Mar 9, 2022 7:02 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకుని ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలు సహా ఓవర్సీస్ లో కూడా మంచి అంచనాలు ఈ చిత్రంపై నెలకొన్నాయి.

మరి ఇదిలా ఉండగా ఈ సినిమాకి గాను యూఎస్ బాక్సాఫీస్ వద్ద బుకింగ్స్ ఓపెన్ చెయ్యగా ఆరంభం లోనే సాలిడ్ బుకింగ్స్ నమోదు అయ్యాయి. మరి ఈ లెక్క ఇప్పుడు సాలిడ్ ఫిగర్ 4 లక్షల డాలర్స్ మార్క్ ని దాటి హాఫ్ మిలియన్ దగ్గరకి వెళ్తుందట. ఇది మంచి విషయం అని చెప్పాలి.

అలాగే రానున్న రోజుల్లో రిలీజ్ డేట్ దగ్గర పడే సరికి మరింత స్థాయిలో సినిమా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి రాధే శ్యామ్ ప్రీమియర్స్ ఎక్కడ ఆగుతాయో అనేది. ఇక ఈ చిత్రానికి మొత్తంగా నలుగురు సంగీత దర్శకులు పని చేయగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :