ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా రాధా కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం “రాధే శ్యామ్”. తెలుగు మరియు హిందీ వర్గాల్లో మంచి అంచనాలను నెలకొల్పుకున్నా ఈ వింటేజ్ లవ్ స్టోరీ కోసం చాలా మందే ఎదురు చూస్తున్నారు. చిత్ర యూనిట్ నుంచి అప్డేట్స్ ఇప్పటివరకు తక్కువే వచ్చినా ప్రభాస్ అభిమానులు మాత్రం ఎక్కడా నిరాశ చెందనివే అందించారు.
అయితే వాటన్నిటినీ మించి బడా అప్డేట్ కోసమే అంతా ఎదురు చూస్తున్న్నారు. అదే రాధే శ్యామ్ టీజర్ కోసం. ఇప్పటికే గతకొన్ని రోజుల నుంచి ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ గా టీజరా లేక మోషన్ పోస్టరా అన్న సందిగ్ధం నుంచి టీజర్ ఫిక్స్ అయ్యిందని టాక్ గట్టిగా వినిపిస్తుంది. ఇప్పుడు ఆ ప్రోగ్రెస్ లో ఉన్నప్పటికీ మాత్రం చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఆ సంకేతాలు అయితే రావడం లేదు.
ప్రస్తుతం షూటింగ్ ప్రోగ్రెస్ లో బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ప్రభాస్ పుట్టినరోజుకు రెండు మూడు రోజుల ముందు నుంచి బిగ్ అప్డేట్ కు అలెర్ట్ చేసే విధంగా ప్లాన్ చేసి ఉన్నట్టు టాక్. అప్పుడు అయితే ఇంపాక్ట్ మరింత లెవెల్లో ఉంటుందని ప్లాన్ చేసి ఉండొచ్చు. ఇప్పటికే ఈ అప్డేట్ కోసం స్పెషల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరి రాధే శ్యామ్ యూనిట్ ప్లానింగ్ ఎలా ఉందో చూడాలికి.
