
రాధికా ఆప్టే.. తెలుగు, తమిళ్, హిందీ, మరాఠి వంటి భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. అయితే ఈమె ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలు ‘పర్చేడ్, మ్యాడ్లీ’ అనే రెండు సినిమాల్లో సన్నివేశాలు లీకై ఆమె చేసిన పాత్రలు మరీ బోల్డ్ గా ఉన్నాయని, అలాంటి సన్నివేశాలు తీయడం, వాటిలో నటించడం మంచిది కాదని తప్పని ఆమెపై పలువురు తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఒకానొక దశలో ఆ విమర్శలు హద్దులు దాటి మరీ ఇబ్బందికరంగా ఆమె గత జీవితాన్ని టార్గెట్ చేసే తారాస్థాయికి చేరుకొన్నాయి. అయినా కూడా రాధికా ఆప్టే ఏమాత్రం ఆత్మస్థైర్యం కోల్పోలేదు.
నటిగా నాకు నచ్చిన పాత్ర ఎలా డిమాండ్ చేస్తే అలా నటిస్తానని, తనకూ హద్దులు తెలుసనీ గట్టి సమాధానము ఇచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈమె ‘పర్చేడ్, మ్యాడ్లీ’ సినిమాల్లోని పాత్రల తరహా పాత్రను మారోసారి చేయనుంది. తన తరువాతి సినిమా ‘బొంబైరియా’ లో ఆమె ఒక బాలీవుడ్ హీరోకి పబ్లిసిటీ చేసే వ్యక్తిగా నటిస్తోంది. సినిమాలో ఆమెకు, ఆ హీరోకు మధ్య నడిచే ఒక వ్యక్తిగత విషయం ఎంఎంఎస్ రూపంలో ఆమె మొబైల్ ఫోన్లో ఉంటుంది. ఆ ఫోన్ ను ఒక దొంగ దొంగిలిస్తాడు. అందులో ఉన్న ఆ ఎంఎంఎస్ లీకైతే తన పరువు, హీరో పరువు పోతుందని ఆ దొంగని వెంటాడుతుంటుంది రాధికా ఆప్టే పాత్ర. గతంలో తన పై ఎన్ని విమర్శలొచ్చినా కుంగిపోకుండా సినిమా కోసం అన్నిటినీ ఎదిరించి మరోసారి ఆమె బోల్డ్ క్యారెక్టర్ ను చేశారని దర్శకుడు మిచెల్ ఎ వర్డ్ మీడియాకు తెలిపాడు.