అమ్మమ్మ అయిన ప్రముఖ హీరోయిన్ !

అమ్మమ్మ అయిన ప్రముఖ హీరోయిన్ !

Published on Jun 8, 2018 1:39 PM IST

ఒకప్పుడు అగ్ర హీరోయిన్ గా అగ్రహీరోలందరితో నటించి ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ రాధిక శరత్ కుమార్. ఇప్పుడు ఈమె అమ్మమ్మగా ప్రమోషన్ పొందారు. రాధిక కుమార్తె ‘రయానె’ చెన్నైలోని ఓ ప్రముఖ హాస్పిటలో నిన్న పండంటి బిడ్డకు జన్మనించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. రయానె క్రికెటర్ మిదున్ చక్రవర్తి భార్య అని తెలిసిన విషయమే. రయానె రాధికకు తన రెండో భర్త, బ్రిటిషర్ అయిన రిచర్డ్ హార్డీ ద్వారా జన్మించింది. ఇంగ్లండ్‌లో గ్రాజ్యుయేషన్ పూర్తిచేసిన రయానె ప్రస్తుతం తన భర్తతో చెన్నైలోనే నివసిస్తున్నారు.

రయానె భర్త మిథున్‌ భారత జట్టు తరపున 4 టెస్టులు, 5 వన్డేలు ఆడారు. రయానె మాత్రం రాధికకు చెందిన సంస్థ ‘రాడాన్ మీడియా’ వ్యవహారాలు చూసుకుంటున్నారని తెలుస్తోంది. అయితే తను అమ్మమ్మ అయినందుకు రాధిక ఆనందంతో ఉబ్బితబ్బిపోతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు