ఇండియన్ సినిమా దగ్గర ఇప్పుడు సీక్వెల్ చిత్రాలకి యమ క్రేజ్ అండ్ డిమాండ్ ఉండొచ్చు కానీ సీక్వెల్ సినిమాలు మాత్రం ఎప్పుడు నుంచో ఉన్నాయి. కాకపోతే అప్పుడు పాన్ ఇండియా ఫ్యాక్టర్ అంత పాపులర్ కాదు కాబట్టి వాటి కోసం తక్కువ మాట్లాడుకునేవారు. అలా ఎప్పుడో సీక్వెల్స్ పర్వం స్టార్ట్ చేసి మంచి హారర్ కామెడీ ఫ్రాంచైజ్ ని సెట్ చేసిన దర్శకుడు, హీరోనే రాఘవ లారెన్స్. తన ముని, కాంచన సిరీస్ ఎంత హిట్ అనేది అందరికీ తెలిసిందే.
అయితే ఇందులో కాంచన 4 ని ఇపుడు తాను తెరకెక్కిస్తున్నాడు. కానీ ఈ సినిమానే ఈ సిరీస్ లో ఇక ఆఖరిది అనే టాక్ ఇపుడు వైరల్ గా మారింది. ఇది ఒకింత లారెన్స్ అభిమానులకి చేదు వార్తే కానీ దీని తర్వాత లారెన్స్ కి కొత్త ప్లానింగ్ లు ఉన్నాయని తెలుస్తుంది. ప్రస్తుతం తన సినిమాలు పూర్తి తర్వాత కొత్త అటెంప్ట్ లు తన నుంచి చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు మరో వెర్షన్ వినిపిస్తుంది. సో లారెన్స్ కొత్త సిరీస్ గాని ఫ్రాంచైజ్ గాని మొదలు పెడుతున్నారా అనేది వేచి చూడాలి.
