“హంటర్” గా రాఘవ లారెన్స్…ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్!

“హంటర్” గా రాఘవ లారెన్స్…ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్!

Published on Apr 14, 2024 8:01 PM IST

టాలెంటెడ్ నటుడు, కొరియోగ్రాఫర్, డైరెక్టర్ రాఘవ లారెన్స్ నేడు మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. చివరిసారిగా ఈ నటుడు జిగర్ తండ డబుల్ ఎక్స్ మూవీ లో కనిపించారు. ఈ చిత్రం ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. నేడు సరికొత్త ప్రాజెక్ట్ హంటర్ ను అనౌన్స్ చేశారు. రాఘవ లారెన్స్ కెరీర్ లో 25 వ చిత్రం గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఐ. వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు.

మేకర్స్ రిలీజ్ చేశారు పోస్టర్ ఆసక్తికరం గా ఉంది. చిరుత పులి తల మీద ఒక వ్యక్తి నిలబడినట్లు పోస్టర్ లో ఉంది. ఆ వ్యక్తి గన్ పట్టుకొని ఉన్నాడు. బ్యాటిల్ ఫర్ ది సౌల్ అనే కోటేశన్ మరింత ఆసక్తికరంగా ఉంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని గోల్డ్ మైన్స్ టెలిఫిల్మ్స్, సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు