ఫ్యాన్స్ కోసం లారెన్స్ ఒక ఎమోషనల్ మంచి నిర్ణయం.!

ఫ్యాన్స్ కోసం లారెన్స్ ఒక ఎమోషనల్ మంచి నిర్ణయం.!

Published on Feb 24, 2024 8:08 PM IST


తమిళ మల్టీ టాలెంటెడ్ హీరో మరియు దర్శకుడు అయినటువంటి రాఘవ లారెన్స్ రీసెంట్ గానే నటించిన చిత్రం “జిగర్ తండ డబుల్ ఎక్స్” తో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. అయితే లారెన్స్ ఎప్పుడు కూడా సినిమాలతో పాటుగా సమాజం పట్ల కూడా ఎంతో అంకిత భావంతో ఉంటాడని తెలిసిందే. అలా ఎన్నో సేవా కార్యక్రమాలు ఇప్పుడుకీ చేస్తున్న లారెన్స్ తాజాగా తన అభిమానుల కోసం ఒక ఎమోషనల్ నిర్ణయాన్ని అయితే తీసుకున్నాడు.

తాను రీసెంట్ గా ఓ పోస్ట్ షేర్ చేసి లాస్ట్ టైం ఒకసారి చెన్నై లో జరిగిన ఫోటో షూట్ కోసం తనని కలిసేందుకు వచ్చిన ఓ అభిమాని దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది అని తన కోసం మీరు రావద్దు మీకోసం నేనే వస్తున్నాను అని అది రేపటి నుంచే ఫోటో షూట్ స్టార్ట్ చేస్తున్నాను అని లారెన్స్ తెలిపి తన అభిమానుల జీవితాల కోసం ఈ మంచి నిర్ణయాన్ని అయితే తాను తీసుకున్నాడు. ఇది ఖచ్చితంగా హర్షణీయం అని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు