“హను మాన్” నుండి రఘునందన సాంగ్ కి టైమ్ ఫిక్స్!

“హను మాన్” నుండి రఘునందన సాంగ్ కి టైమ్ ఫిక్స్!

Published on Feb 19, 2024 8:50 PM IST

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, తేజ సజ్జ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హీరో మూవీ హను మాన్. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల రూపాయలకి పైగా వసూళ్లు రాబట్టి, సెన్సేషన్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ చిత్రం లో మంచి విజువల్స్ తో గూస్ బంప్స్ ఇచ్చిన సాంగ్ రఘునందన. ఈ వీడియో సాంగ్ ను మేకర్స్ రేపు రిలీజ్ చేయనున్నారు.

రేపు సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తాజాగా ఒక సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సూపర్ హీరో మూవీ లో అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు