సినిమాలు చేయనని జోక్ చేశా.. రాహుల్ రామకృష్ణ క్లారిటీ..!

సినిమాలు చేయనని జోక్ చేశా.. రాహుల్ రామకృష్ణ క్లారిటీ..!

Published on Feb 5, 2022 8:17 PM IST

ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న యంగ్ అండ్ టాలెంటెడ్ నటుడు రాహుల్ రామకృష్ణ కొద్ది గంటల క్రితం చేసిన ఓ ట్వీట్ అటు సోషల్ మీడియాలో, ఇటు ఇండస్ట్రీలో హాట్ టాఫిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ‘2022’ నా చివరిదని.. ఇకపై సినిమాలు చేయనని చెప్పుకొచ్చాడు. అయితే సడెన్‌గా రాహుల్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? అసలు కారణం ఏమై ఉంటుంది? అనే ప్రశ్నలు అనేక మందిలో మెదిలాయి.

అయితే తాజాగా రాహుల్ రామకృష్ణ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. “సినిమాలు చేయనని జోక్ చేశానని.. భారీ రెమ్యునరేషన్, విలాసమైన జీవితం, ఎన్నో ప్రయోజనాలను ఎందుకు వదులుకుంటానని అన్నాడు. నేను రిటైర్మెంట్ చెప్పానని నన్ను అభినందించడానికి నా స్నేహితులు ఫోన్ చేయడం ఆశ్చర్యాన్ని నమ్మలేకపోయానని అన్నాడు. అయితే రాహుల్ కేవలం సరదా కోసమే ఇలా చేసినా దీనిపై కొందరు నెటిజన్లు మాత్రం మండిపడుతున్నారు.

https://twitter.com/eyrahul/status/1489947310260101124?s=20&t=ISSlcyQIa7i9qH8m2-l8-g

సంబంధిత సమాచారం

తాజా వార్తలు