ఓజీ లో తన రోల్ పై రాహుల్ రవీంద్రన్ కామెంట్స్!

ఓజీ లో తన రోల్ పై రాహుల్ రవీంద్రన్ కామెంట్స్!

Published on Feb 20, 2024 3:05 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఓజీ. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ నుండి చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న స్ట్రెయిట్ మూవీ కావడం, తన ఫ్యాన్ సుజిత్ దర్శకత్వం వహిస్తుండటం తో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఈ చిత్రాన్ని చాలా స్పెషల్ కేర్ తో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి టాలెంటెడ్ నటీనటులు ఇందులో ఉన్నారు. ఈ చిత్రం లో రాహుల్ రవీంద్రన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు. సుజిత్ తనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని, ఈ రోల్ కెరీర్ బెస్ట్ అంటూ చెప్పుకొచ్చారు. ఈ స్టేట్మెంట్ వైరల్ గా మారుతోంది. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ నెలలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు