
టాలీవుడ్ లో ‘అలా ఎలా’ వంటి చిన్న చిత్రం సాధించిన అనూహ్య విజయంతో యువ హీరో రాహుల్ రవీంద్రన్ ఆనందంలో వున్నాడు. ఈ చిత్రం అందించిన ప్రోత్సాహం రాహుల్ కి మరిన్ని అవకాశాలను తీసుకొచ్చే పనిలోవుంది
తాజా సమాచారం ప్రకారం రాహుల్ ఒక బాలీవుడ్ మూవీ కి సంతకం చేశాడు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ కొత్త సినిమా చిత్రాకరణ వచ్చే ఏడాది నుండి మొదలుకానుంది. అంతేకాక 2015 జూన్ నుండి ‘అలా ఎలా’ సినిమాకు కొనసాగింపు ప్లాన్ చేసిన విషయం తెలిసినదే. వరుసపెట్టి ఆఫర్లతో ఈ యువనటుడి భవిష్యత్తు ఉజ్వలంగా సాగాలని ఆశిద్దాం

