నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్‌లో నటించిన రీసెంట్ రొమాంటిక్ డ్రామా చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ ఇటీవల రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర మంచి హిట్ బొమ్మగా నిలిచింది. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను డైరెక్ట్ చేయగా ఇందులో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు దక్కాయి.
ఇక ఈ సినిమా ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ఓటీటీలోకి ది గర్ల్‌ఫ్రెండ్ చిత్రం వచ్చాక, కొందరు సినిమాతో పాటు దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌ను కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. తాజాగా ఓ నెటిజన్ చేసిన కామెంట్‌కు చాలా హార్డ్ కౌంటర్ ఇచ్చారు రాహుల్ రవీంద్రన్. తాను సినిమాను ఇలానే తీస్తానంటూ చాలా హార్ష్ భాషను వాడారు చిత్ర దర్శకుడు. ఈ ట్వీట్‌తో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.
ఎవరు ఎలాంటి కామెంట్ చేసినా, తన సినిమాకు మరింత గుర్తింపు మాత్రమే వస్తుందని.. ఇప్పటికే తమ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో దూసుకుపోతుందని.. ఇంకా తమ సినిమాను ట్యాగ్ చేస్తూ ఉంటే అది మరింత హైలైట్ కావడం ఖాయమని ఆయన తెలిపారు. ఏదేమైనా గర్ల్‌ఫ్రెండ్ మూవీలోని కంటెంట్, లాంగ్వేజ్ కొందరికి నచ్చితే, మరికొందరు దానిపై మండి పడటం గమనార్హం.
