
సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో పాటు, తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘శ్రీమంతుడు’. గత శనివారం రిలీజ్ అయిన దేవీశ్రీ ప్రసాద్ మ్యూజికల్ ఆల్బమ్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా మహేష్ బాబు బర్త్ డే కానుకగా ఆగష్టు 7న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇటీవలే ఆడియో ఫంక్షన్ లో రాహుల్ రవీంద్రన్ ఎవరి ఫ్యామిలీ చెందిన వాణ్ణి అనే విషయం చెబుతూ నేను మహేష్ బాబు ఫ్యామిలీకి చెందిన వ్యక్తి అని తెలియజేశాడు.
ఈ మహేష్ బాబు ఫ్యామిలీ రహస్యం వెనక ఉన్న విషయం గురించి కనుక్కుంటే.. ఈ సినిమాలో రాహుల్ రవీంద్రన్ మహేష్ బాబుకి కజిన్ బ్రదర్ లా కనిపిస్తాడని సమాచారం ఇచ్చారు. రాహుల్ కనిపించేది చేలా కొద్దిసేపే అయినా ఆ పాత్ర కథలో కీలక మలుపని ఈ చిత్ర సన్నిహిత వర్గాలు తెలిపాయి. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి మిర్చి ఫేం కొరటాల శివ డైరెక్టర్. మహేష్ బాబు కాలేజ్ స్టూడెంట్ గా కూడా కనిపించనున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాజేంద్ర ప్రసాద్, అంగన రాయ్, సనమ్ శెట్టి, పూర్ణ ముఖ్య పాత్రలు పోషించారు.

