‘మ్యూజిక్ షాప్ మూర్తి’ నుంచి రాహుల్ సిప్లిగంజ్ మాస్ సాంగ్ రిలీజ్

‘మ్యూజిక్ షాప్ మూర్తి’ నుంచి రాహుల్ సిప్లిగంజ్ మాస్ సాంగ్ రిలీజ్

Published on May 18, 2024 11:30 AM IST

ప్రస్తుతం టాలీవుడ్ లో కంటెంట్ ప్రధానంగా తెరకెక్కించే చిత్రాలను ఆడియెన్స్ ఆధరిస్తున్నారు. అలా ఓ కంటెంట్ బేస్డ్ మూవీగా ఫ్లై హై సినిమాస్ బ్యానర్ మీద అజయ్ ఘోష్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో రాబోతున్న సినిమానే “మ్యూజిక్ షాప్ మూర్తి”. కాన్సెప్ట్ , కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాను హర్ష గారపాటి, రంగారావు గారపాటి నిర్మించారు.

శివ పాలడుగు ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించారు. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, పాటలు, టీజర్‌ ఇలా అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రం నుంచి ‘అంగ్రేజీ బీట్’ అంటూ అదిరిపోయే బీటున్న పాటను విడుదల చేశారు. అంగ్రేజీ బీట్ అంటూ సాగే ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు.

ఇక ఈ లిరికల్ వీడియోలో డీజే మూర్తిగా అజయ్ ఘోష్ ఆహార్యం, వేసిన స్టెప్పులు, కనిపించిన తీరు అందరినీ ఆకట్టుకునేలా ఉంది. పవన్ లిరిక్స్, బాణీలు ఈ పాటను ప్రత్యేకంగా మార్చేశాయి.మంచి హుషారైన బీటుతో ప్రస్తుతం ఈ పాట అందరినీ ఆకట్టుకునేలా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. వచ్చే నెలలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ చిత్రానికి సాంకేతిక బృందం – బ్యానర్: ఫ్లై హై సినిమాస్, నిర్మాతలు: హర్ష గారపాటి & రంగారావు గారపాటి, సహ నిర్మాతలు: సత్య కిషోర్ బచ్చు, వంశీ ప్రసాద్ రాజా వాసిరెడ్డి, సత్యనారాయణ పాలడుగు, రచన & దర్శకత్వం: శివ పాలడుగు, సంగీతం: పవన్, కెమెరామెన్: శ్రీనివాస్ బెజుగం, ఎడిటర్: బొంతల నాగేశ్వరరెడ్డి, పీఆర్వో: ఎస్ ఆర్, ప్రమోషన్స్ (సాయి సతీష్) లు అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు