రాయ్ లక్ష్మికి బాలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్!

రాయ్ లక్ష్మికి బాలీవుడ్‌లో మరో క్రేజీ ఆఫర్!

Published on Sep 14, 2015 2:04 PM IST

rai-lakshmi

రాయ్ లక్ష్మి.. తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా మెప్పిస్తూనే, స్పెషల్ సాంగ్స్‌తోనూ మెప్పిస్తూ వస్తోన్న ఈ నటి, తాజాగా బాలీవుడ్‌లో కూడా వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న ‘అకిరా’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోన్న రాయ్ లక్ష్మి, తాజాగా మరో బాలీవుడ్‌ను ఆఫర్‌ను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌లో మంచి హిట్ సాధించిన ‘జూలీ’ అనే రొమాంటిక్ థ్రిల్లర్‌కు సీక్వెల్‌గా రూపొందనున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యారు.

‘జూలీ 2’ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాయ్ లక్ష్మి ఫుల్ గ్లామరస్‌గా కనిపించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో సినిమా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం బెంగళూర్ డేస్ తమిళ రీమేక్‌తో పాటు పలు ఇతర తమిళ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీగా ఉన్న రాయ్ లక్ష్మి, పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్‌లోనూ నటిస్తోన్న విషయం తెలిసిందే!

సంబంధిత సమాచారం

తాజా వార్తలు