త్రివిక్రమ్ మళ్ళీ అత్త చుట్టే కథ అల్లాడా?

త్రివిక్రమ్ మళ్ళీ అత్త చుట్టే కథ అల్లాడా?

Published on Jul 25, 2019 7:07 AM IST

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా విడుదల కానునున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. బన్నీ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

కాగా సీనియర్ హీరోయిన్ టబు ఈ మూవీలో ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఆమె ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. ఐతే దర్శకుడు త్రివిక్రమ్ అత్తారింటికి దారేది చిత్ర విజయం తరువాత నుండి తన చిత్రాలలో ఓ పవర్ఫుల్ లేడీ రోల్ చుట్టూ కథ రాసుకుంటున్నారు. అత్తారింటికి దారేది, అ ఆ చిత్రాలలో నటి నదియా తో సునంద, మహాలక్ష్మి వంటి పాత్రలు చేయించిన ఈయన, అజ్ఞాతవాసి చిత్రంలో ఖుష్బూతో పవన్ తల్లిగా ప్రాధాన్యం ఉన్న పాత్ర చేయించారు.

దీనితో బన్నీ చిత్రం లోని టబు పాత్రపై ఆసక్తి నెలకొంది. దర్శకుడు ఈ చిత్రాన్ని సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా తెరకెక్కిస్తున్నారని సమాచారం. హీరోయిన్ నివేదా థామస్ బన్నీ సిస్టర్ గా చేస్తున్న తరుణంలో టబుని కూడా త్రివిక్రమ్ అత్తగా చూపించబోతున్నారా అనే సందేహం కలుగుతుంది. దీనికి తోడు అత్తారింటికి దారేది, అ ఆ చిత్రాలలో అత్త పాత్రలతోనే హిట్ కొట్టిన సెంటిమెంట్ కూడా ఉండటంతో దాదాపు టబు బన్నీ అత్తగా చేస్తారనిపిస్తుంది. ఈ చిత్రంలో టబు పాత్రపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.ఈ చిత్రం లో హీరో సుశాంత్, నవదీప్ కూడా కీలక పాత్రలు చేస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు

సంబంధిత సమాచారం

తాజా వార్తలు