‘రాజ్ తరుణ్‌’తో పెళ్లి పై లావణ్య క్లారిటీ

‘రాజ్ తరుణ్‌’తో పెళ్లి పై లావణ్య క్లారిటీ

Published on Jul 7, 2024 8:17 PM IST

యంగ్ హీరో రాజ్ త‌రుణ్ పై నార్సింగి పోలీస్ స్టేష‌న్ లో కేసు న‌మోదయిన సంగతి తెలిసిందే. త‌న‌ను మోసం చేశాడంటూ రాజ్ త‌రుణ్ ప్రేయ‌సి లావ‌ణ్య ఈ కంప్లైంట్ న‌మోదు చేసింది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రాజ్ తరుణ్‌ తో తన పెళ్లి పై లావణ్య షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ, లావణ్య ఏం మాట్లాడింది అంటే.. ‘మా పేరెంట్స్‌కు ఇష్టం లేకపోయినా నేను రాజ్ తరుణ్‌ను పెళ్లి చేసుకున్నాను. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్‌ తో కలిసి ఉంటున్నాను. మేం ఇద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం’ అని లావణ్య చెప్పుకొచ్చింది.

లావణ్య ఇంకా మాట్లాడుతూ.. ‘గత 5 నెలలుగా నాకు రాజ్ కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. హీరోయిన్ మాల్వీతో రాజ్ తరుణ్ కి ఎఫైర్ ఉంది. ఆమె నన్ను చంపుతానని బెదిరించింది కూడా. అందుకే నేను పోలీసులకు ఫిర్యాదు చేశాను. నా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఒక్కటి మాత్రం స్పష్టం, రాజ్ లేకుండా నేను బతకలేను’ అంటూ లావణ్య తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు