
షర్ట్ ఫిల్మ్స్ ద్వారా యు ట్యూబ్ ప్రేక్షకులను మెప్పించిన రాజ్ తరుణ్ ఓ సినిమాకి అసిస్టెంట్ గా పని చేద్దాం వచ్చి ఆ సినిమాలో హీరో గా సెలక్ట్ అయిపోయాడు. అలా రాజ్ తరుణ్ చేసిన మొదటి సినిమా ‘ఉయ్యాలా జంపాలా’తో హిట్ అందుకొని రీసెంట్ గా ‘సినిమా చూపిస్త మావ’తో సెకండ్ హిట్ ని కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా రెండు హిట్స్ అందుకున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీనివాస్ గవిరెడ్డి డైరెక్షన్ లో తన మూడవ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది.
మూడావ సినిమా సెట్స్ పై ఉండగానే రాజ్ తరుణ్ కి ఓ బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. అదే అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో 4వ సినిమా చేసే అవకాశం రావడం. ఈ సినిమా ద్వారా సుకుమార్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మున్న దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఇప్పటికే మున్న చెప్పిన స్టొరీ లైన్ నచ్చడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని స్పీడప్ చేసారు. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. కెరీర్ ప్రారంభంలోనే గీత ఆర్ట్స్ 2 లాంటి బ్యానర్ లో రాజ్ తరుణ్ కి ఛాన్స్ రావడం చెప్పుకోదగిన విషయం. గీత ఆర్ట్స్ వారు ఇచ్చిన అవకాశాన్ని పర్ఫెక్ట్ గా సద్వినియోగం చేసుకోవాలని రాజ్ తరుణ్ – డైరెక్టర్ మున్నా కృషి చేస్తున్నారు.