అక్కడ రాజాసాబ్‌కు పోటీగా జన నాయగన్.. బాక్సాఫీస్ క్లాష్ తప్పదు..!

అక్కడ రాజాసాబ్‌కు పోటీగా జన నాయగన్.. బాక్సాఫీస్ క్లాష్ తప్పదు..!

Published on Dec 23, 2025 10:00 AM IST

రాజాసాబ్‌

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది రాజాసాబ్’ సంక్రాంతి కానుకగా జనవరి 9, 2026న రిలీజ్ కానుంది. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేసిన ఈ హారర్ కామెడీ చిత్రంతో ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. ఇక ఓవర్సీస్‌లోనూ ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే అడ్వాన్స్ ప్రీ-సేల్స్ మొదలుకావడంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.

అయితే, తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ కూడా పొంగల్ బరిలో రానుంది. హెచ్.వినోద్ డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో విజయ్ తన బాక్సాఫీస్ ట్రాక్‌ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు. ఇక ఈ సినిమాకి కూడా ఓవర్సీస్‌లో మంచి క్రేజ్ నెలకొంది. ఈ చిత్రం నుండి ఇప్పటివరకు ఎలాంటి టీజర్, ట్రైలర్ రాకపోయినా, క్రేజ్ కారణంగా ఈ సినిమాకు కూడా ఓవర్సీస్‌లో మంచి రెస్పాన్స్ రావడం ఖాయంగా తెలుస్తోంది.

తాజాగా ఈ చిత్ర ప్రీ-సేల్స్‌ను ఓవర్సీస్‌లో ఓపెన్ చేయగా, తక్కువ సమయంలోనే ఈ చిత్రం సాలిడ్ బుకింగ్స్‌తో దూసుకుపోతుంది. ఈ ట్రెండ్ చూస్తుంటే, ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి రాజాసాబ్‌కు జననాయగన్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుందని సినీ సర్కిల్స్ టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు