SSMB29: ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చిన రాజమౌళి

SSMB29: ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చిన రాజమౌళి

Published on Mar 1, 2024 5:00 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు గుంటూరు కారం మూవీ తో ఈ ఏడాది ఆడియెన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. మహేష్ బాబు తదుపరి జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లో నటించనున్నారు. ఈ చిత్రం కి SSMB29 వర్కింగ్ టైటిల్ గా ఉంది. ఈ చిత్రం కి ఇంకా టైటిల్ ను ఖరారు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

మహేష్ బాబు సినిమాకి ఇంకా టైటిల్ ను ఫిక్స్ చేయలేదు అని తెలిపారు. అయితే త్వరలో షూటింగ్ ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. రాజమౌళి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రం కోసం మహేష్ బాబు ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారు. ఇండియా లోనే భారీ బడ్జెట్ చిత్రం గా ఇది తెరకెక్కనున్నట్లు వార్తలు వచ్చాయి. సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు