జక్కన్న బిగ్ అప్‌డేట్: ‘వారణాసి’ థియేటర్లలోకి వచ్చేది ఆ రోజే!

Varanasi

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వారణాసి’ (Varanasi) కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘రుద్ర’ అనే పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి.

ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌తో యావత్ వరల్డ్‌వైడ్‌గా అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశారు మేకర్స్. అయితే, ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ డేట్‌తో సోషల్ మీడియాలో ‘వారణాసి’ ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న వరల్డ్‌వైడ్‌గా పలు ఫార్మాట్‌లలో రిలీజ్ చేస్తున్నట్లు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అధికారికంగా ప్రకటించారు.

దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Exit mobile version