
తెలుగు సినిమాగా తెరకెక్కిన టాలీవుడ్ మోస్ట్ ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ ‘బాహుబలి’ ఇండియా వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది. టెక్నికల్ వాల్యూస్ పరంగానే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా 24 రోజుల్లో 500 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి సౌత్ ఇండియన్ టాప్ ఫిల్మ్ గా రికార్డ్ సాధించింది. ఈ కలెక్షన్స్ బాలీవుడ్ ట్రేడ్ పండితులను కూడా ముక్కున వేలేసుకునేలా చేసాయి. కలెక్షన్స్ కాకుండా ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్, గ్రాఫిక్స్ హాలీవుడ్ సినిమాని తలపించేలా ఉండడం సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. దీనివల్ల సోషల్ మీడియాలో ఈ ఏడాది ఆస్కార్ నామినేషన్స్ కి వెళ్తుందని అంటున్నారు.
ఇదే విషయాన్ని ఇటీవల ఇచ్చిన ఓ రీసెంట్ ఇంటర్వ్యూలో రాజమౌళి ఉంచితే ‘మొదట రాజమౌళి బిగ్గరగా నవ్వి.. బాహుబలి ఆస్కార్ అవార్డు గెలుచుకునేంత సినిమా కాదు, ఈ సినిమాకి అంత లేదని నేను భావిస్తున్నాను. హాలీవుడ్ స్టాండర్డ్స్ తో పోల్చుకుంటే బాహుబలి స్టార్టింగ్ లెవల్ సినిమా మాత్రమే.. అందుకే నేను బాహుబలి సినిమా ఆస్కార్ రేంజ్ సినిమా కాదని భావిస్తున్నానని’ రాజమౌళి తెలిపాడు. ప్రస్తుతం రాజమౌళి బాహుబలి సినిమా సెకండ్ పార్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. సెప్టెంబర్ నుంచి బాహుబలి పార్ట్ 2 సెట్స్ పైకి వెళ్లనుంది.