
టాలీవుడ్, కోలీవుడ్ మరియు బాలీవుడ్.. ఇలా అన్ని సినీ ఇండస్ట్రీలు ఎంతగానో ఎదురుచూస్తున్న గ్రాఫికల్ వండర్ అయిన పీరియాడికల్ ఫిల్మ్ ‘బాహుబలి’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్ ని మే 31న రిలీజ్ చేస్తామని చెప్పి, ఆ తర్వాత మే 1 నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. అందులో భాగంగా రోజు మార్చి రోజు ఈ సినిమాని ఒక్కో పాత్రకి సంబందించిన పాత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకూ రిలీజ్ చేసిన అన్ని ఫస్ట్ లుక్స్ కి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది.
తాజాగా ఈ రోజు బిజ్జలదేవ అనే పాత్ర ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. బాహుబలి సినిమాలో బిజ్జలదేవ పాత్రలో ప్రముఖ నటుడు నాజర్ కనిపించనున్నాడు. కొద్దిసేపటి క్రితమే ఈ బిజ్జలదేవ(తమిళంలో పింగలతేవన్) ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసారు. నాజర్ లుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ‘బాహుబలి బిజ్జలదేవ పాత్రని నాజర్ గారు చేసారు. ఈ సినిమలో నాకు బాగా నచ్చిన పాత్ర ఇదని’ రాజమౌళి అన్నాడు. అలాగే బిజ్జలదేవ పాత్ర ఎలా ఉంటుందనేడి వివరిస్తూ ‘ప్రతి పదంలోనూ విషం ఉంటుంది, ప్రతి స్టెప్ లోనూ ఆగ్రహం ఉంటుంది, ప్రతి ఆలోచనలోనూ అసూయ ఉంటుంది.. అదే బిజ్జలదేవ క్యారెక్టర్’ అని తెలిపారు.
ఇప్పటి వరకూ ప్రభాస్, అనుష్క, రమ్యకృష్ణ, ప్రభాకర్, నాజర్ పాత్రలకు సంబందించిన ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చేసారు. ఇక రానా, తమన్నా, సత్య రాజ్, సుధీప్ తదితరులకు సంబందించిన ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చెయ్యాలి. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాఆడియో ని మే 31న విడుదల చేసి, సినిమాని జూలై 10న రిలీజ్ చెయ్యాలని ఈ చిత్ర టీం ప్లాన్ చేస్తోంది.

