వేరే చిత్రం కోసం సమయం వెచ్చించిన రాజమౌళి

వేరే చిత్రం కోసం సమయం వెచ్చించిన రాజమౌళి

Published on May 16, 2014 3:50 PM IST

ss-rajamouli
ప్రస్తుతం ‘బాహుబలి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నప్రముఖ దర్శకుడు యెస్.యెస్. రాజమౌళి తన చిత్రాన్ని విజయవంతం చేయడానికి తను చేయగలిగినంతా చేస్తున్నాడు. ఎంత తీరిక లేకుండా వున్నా రాజమౌళి వేరే చిత్రాల చూడడానికి సమయం వెచ్చిస్తాడు.

ఇటివలే తీరిక చేసుకుని టామ్ హాంక్స్ నటించిన ‘కెప్టెన్ ఫిలిప్స్’ చిత్రం చూసిన రాజమౌళి తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నాడు. ” ‘కెప్టెన్ ఫిలిప్స్’ చిత్రం చూసాను అద్బుతమైన కధనం అద్బుతమైన నటన. క్లైమాక్స్ లో టామ్ హాంక్స్ చూపించిన స్టేట్ ఆఫ్ షాక్ అతని నటనా పటిమకు నిదర్శనం ” అని ట్వీట్ చేసాడు.

రాజమౌళి ‘బాహుబలి’ టాలీవుడ్ ఎంత గానో ఎదురుచూస్తున్న చిత్రం. ప్రస్తుతం చిన్న విరామం లో వున్నా ఈ చిత్ర బృందం త్వరలో తిరిగి షూటింగ్ లో పాల్గోనుంది.

తాజా వార్తలు