రాజమౌళి మొదటి చిత్రం విడుదలై నేటికి 18ఏళ్ళు పూర్తయింది. ఎన్టీఆర్ హీరోగా,గజాల హీరోయిన్ గా ఆయన తెరకెక్కించిన స్టూడెంట్ నంబర్ వన్ చిత్రం 27 సెప్టెంబర్ 2001లో విడుదలై ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ రెండవ చిత్రంతో మొదటి హిట్ అందుకున్నారు. మెగా ప్రొడ్యూసర్ అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణ వహించారు.
కాగా ఆనాటి స్టూడెంట్ నంబర్ వన్ చిత్రం సెట్స్ లో సరదా సమయంలో ఎన్టీఆర్ హీరోయిన్ గజాల మూతి నిండా లిప్ స్టిక్స్ పూసి ఆట పట్టిస్తుంటే పక్కనే ఉన్న రాజమౌళి నవ్వుతూ నిలబడి ఉన్న ఫోటో ఎంటర్టైనింగ్ గా ఉంది. చిన్నప్పటి నుండి అల్లరివాడైన ఎన్టీఆర్ సెట్స్ లో కూడా అలానే ఉండేవాడు అనడానికి ఈ ఫోటో నిదర్శనం. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మొదటి సినిమా ఎన్టీఆర్ తో చేసిన రాజమౌళి తన రెండవ చిత్రం సింహాద్రి కూడా ఆయనతోనే తీశారు. రాజమౌళి తన కెరీర్లో అత్యధికంగా ఎన్టీఆర్ తో నాలుగు చిత్రాలు చేశారు.



