అంతకంతకు అంచనాలు పెంచేస్తున్న రాజమౌళి.!

Published on Mar 3, 2021 8:00 am IST

ఇప్పుడు ఇండియన్ వైడ్ ఉన్న మోస్ట్ ప్రిస్టేజియస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ లలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బడా మల్టీస్టారర్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” కూడా ఒకటి. బాలీవుడ్ నుంచి కూడా భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఎలాంటి అంచనాలు సెట్ అయ్యాయో కూడా తెలుసు.

కానీ దర్శకుడు రాజమౌళి మాత్రం ఆ అంచనాలను కూడా అభిమానుల్లో మరో స్థాయికి తీసుకెళ్ళిపోతున్నాడు. రాజమౌళి సినిమాల్లో యాక్షన్ పార్ట్ కు ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిందే. అలా ఈ సినిమాలో లేటెస్ట్ గా హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ నిక్ పావెల్ తో డిజైన్ చేషిస్తున్న క్లైమాక్స్ షాట్ పై అప్డేట్ ఇచ్చి RRR ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచారు.

దీనితో ఇక్కడ నుంచి ఈ సినిమాలో యాక్షన్ మాత్రం ఊహించిన దాని కంటే ఎక్కువగానే ఉంటుంది తప్ప తక్కువగా అయితే రాజమౌళి చూపించట్లేదు అని చరణ్ మరియు తారక్ అభిమానులు ఒక ఫైనల్ క్లారిటీకి వచ్చేసారు. మరి రాజమౌళి ఈ సినిమాలో ఏ రేంజ్ యాక్షన్ ను ప్లాన్ చేసారో తెలియాలి అంటే వచ్చే అక్టోబర్ 13వరకు ఆగక తప్పదు.

సంబంధిత సమాచారం :