వర్మ కాంట్రవర్సీ ట్వీట్ కు రాజమౌళి రియాక్షన్ చూశారా…?

వర్మ కాంట్రవర్సీ ట్వీట్ కు రాజమౌళి రియాక్షన్ చూశారా…?

Published on Nov 2, 2019 1:37 PM IST

rajamouli

రామ్ గోపాల్ వర్మ నేడు తాను తీస్తున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ నుండి కేఏ పాల్ గురించి ఒక సాంగ్ ని విడుదల చేశాడు.జేమ్స్ బాండ్ తరహా ఇంట్రడక్షన్ తో ‘నేనే…కె ఏ పాల్…చూపిస్తా కమాల్…, అనే పాటను యూట్యూబ్ లో వదిలారు. గతంలో పాల్ అనేక వేదికలపై,పలు సందర్భాలలో చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా ఆయన ఈ సాంగ్ రూపొందించారు. కాగా దానికి కొనసాగింపుగా వర్మ మరో ట్వీట్ చేశారు. ‘ఇండియాలో జోకర్ మూవీ అంత పెద్ద విజయం సాధించినప్పుడు, కేఏ పాల్ బయోపిక్ బహుబలి 3 కంటే పెద్ద హిట్ అవుతుంది. రాజమౌళి వాషింగ్టన్ లో
కూడా పాల్ తో దీని గురించి చర్చించారట, పాల్ ప్రత్యేకంగా నాకు ఫోన్ చేసి చెప్పారు’ అని ట్వీట్ చేసి అందులో రాజమౌళిని ట్యాగ్ చేశారు.

దీనిపై స్పందించిన రాజమౌళి వర్మను ట్యాగ్ చేస్తూ “ఇందులో నన్ను ఇన్వాల్వు చెయ్యొద్దు ‘రాజు’ గారు” అని ట్వీట్ చేశారు. మీ గొడవల్లోకి, వివాదాలలోకి నన్ను లాగొద్దు అని రాజమౌళి అన్నట్లుగా ఉన్నా, దీనికి వెనుక ఆంతర్యం వేరుగా ఉంది. రాజమౌళి ఆ ట్వీట్లో రాంగోపాల్ వర్మ అని సంబోధించకుండా ‘రాజు’ గారు అని రాయడం…,అది కూడా ‘రాజు’ అనే పదాని క్యాపిటల్ లెటర్స్ లో హైలెట్ చేసి రాయడంతో ఈ కుల వివాదాలలోకి నన్ను లాగొద్దు అని చెప్పినట్లుగా ఉంది. ఇక దీనిపై వర్మ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు