దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి–టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’(Varanasi) ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని ఏప్రిల్ 9, 2027న థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. శ్రీరామ నవమి సందర్భంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్‌ఎస్ కార్తికేయ నిర్మిస్తుండగా, దాదాపు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. సినిమాను పూర్తిగా IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తుండగా, పలు భాషల్లో విడుదల చేయనున్నారు.


