‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ సీన్స్ లో మార్పులు !

‘ఆర్ఆర్ఆర్’లో ఆలియా భట్ సీన్స్ లో మార్పులు !

Published on Feb 13, 2020 12:55 AM IST

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. కాగా ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ ఆలియా భట్ చరణ్ సరసన నటిస్తోన్న తెలిసిందే. కాగా సినిమాలో ఆమె పాత్ర నిడివిని ఇంకా పెంచాలని రాజమౌళి భావిస్తున్నారట. ప్రేక్షకులకు ఆసక్తి కలిగించే కొన్ని ప్రేమ సన్నివేశాలను జోడించనున్నారట. మొదట అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం అయితే సినిమాలో ఆలియా భట్ సీన్స్ తక్కువే ఉన్నాయట. అందుకే ఆమె సీన్స్ పెంచుతున్నారు.

ఇక వచ్చే ఏడాది జనవరి 8న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో.. రామ్ చరణ్ అల్లూరి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ‘ఒలివియా మోరిస్’ నటిస్తోంది. ధృడంగా ఉండే కొమరం భీం పాత్రలో కనిపించేందుకు ఎన్టీఆర్ లాయిడ్ స్టీవెన్స్‌ పర్యవేక్షణలో కఠినమైన కసరత్తులు కూడా చేశాడు. కాగా సినిమాలో ఇతర ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారు.

డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ‘బాహుబలి’ తరవాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడం, ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా పై ఆరంభం నుండి భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు