నాని సినిమా ట్రైలర్‌కు రాజమౌళి ప్రశంస!

నాని సినిమా ట్రైలర్‌కు రాజమౌళి ప్రశంస!

Published on Aug 26, 2015 4:39 PM IST

rajmouli
నాని సినిమా అంటే తెలుగు సినీ అభిమానులకు ఓ ప్రత్యేకమైన ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. ఓ మంచి కథ, ఆసక్తికరమైన సాఫ్ట్ కామెడీ నాని సినిమాల్లో సాధారణంగా కనిపిస్తూంటాయి. ఈ ప్రత్యేకతలే తెలుగు సినీ పరిశ్రమలో నానికి హీరోగా ఓ గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజాగా ఆయన తెలుగులో చిన్న సినిమాలకు ఒక ఐడెంటిటీ కల్పించిన దర్శకుడు మారుతీతో కలిసి ‘భలే భలే మగాడివోయ్’ అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న పెద్ద ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.

ఇక గత కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు, అభిమానుల నుంచే కాక పలువురు సినీ ప్రముఖులు కూడా భలే భలే మగాడివోయ్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపిస్తూ వచ్చారు. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి కూడా భలే భలే మగాడివోయ్ ట్రైలర్‌పై ప్రశంసలు కురిపించారు. “ఇంతకాలం ఈ సినిమా ట్రైలర్‌ను ఎలా మిస్ అయ్యానో తెలియడం లేదు. నాని సినిమా ట్రైలర్ చాలా హిలేరియస్‌గా ఉంది. నన్నడిగితే ఒక సినిమా ట్రైలర్‌ను ఇలాగే కట్ చేయాలి అని చెబుతా. ఇంటరెస్టింగ్ పాయింట్ చుట్టూ వస్తోన్న సినిమాగా భలే భలే మగాడివోయ్ కనిపిస్తోంది” అంటూ రాజమౌళి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు