
పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం మరియు బి. జె. పి కోసం విసృతం గా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.
ఆయన ప్రచారం మంచి ఫలితాలని తెచ్చిపెట్టింది. పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడి చేసిన ప్రచారానికి ఆయనని అందరు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం పవన్ ని పొగిడిన వారి జాబితా లో ప్రముఖ దర్శకుడు రాజమౌళి చేరారు.
రాజమౌళి మాట్లాడుతూ “ఫలితాలు తారుమారు అయ్యుంటే తను చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు వెనుకంజ వేయలేదు. తను నమ్మిన సిద్ధాంతాల కోసం ముందడుగు వేసాడు. ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా యెన్.డి.యె కు మద్దతు ఇవ్వడం పవన్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం. కొత్త ప్రభుత్వం పవన్ నమ్మకాన్ని కాపాడాలని ఆశిద్దాం.” అని అన్నారు.
రాజమౌళి లోక్ సత్తా పార్టీ తరుపున ప్రచారం చేసారు కాని ఆశించిన ఫలితాలు రాలేదు. ఈ విషయమై స్పందిస్తూ “మేము గట్టి పోటీదారులం అని ప్రజలని నమ్మించడం లో పూర్తి గా విఫలం అయ్యాం. కాని మాకు సహకారం అందించిన అందరికి డబ్బు లకి లొంగకుండా లోక్ సత్తా ని నమ్మి ఓటేసిన ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది ఓటర్లకి మా హార్దిక కృతజ్ఞతలు మీకు లోక్ సత్తా పై వున్నా నమ్మకం పార్టీ ముందుకు వెళ్ళడానికి తోడ్పడుతుంది” అని రాజమౌళి తెలిపారు.